AndhraNewsips

జనసేనకు సీపీఐ గుడ్ బై..!?

రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా రాజ‌కీయం ఒక‌టేన‌ని నిరూపిస్తున్నాయి ప్ర‌స్తుత‌ తెలంగాణ‌ ఎన్నిక‌లు. తెలంగాణలో జ‌రుగుతున్న ఎన్నిక‌లలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ (కాంగ్రెస్‌,టీడీపీ,సిపిఐ,టీజేఎస్ ) కూట‌మిగా ఏర్పడి బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే.
తెలంగాణలో మిత్రులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శత్రువులుగా ఉన్న‌ సంద‌ర్భాలున్నాయి. ప్ర‌ధానంగా క‌మ్యూనిస్టు పార్టీ అయిన‌టువంటి సిపీఐ (తెలంగాణ) కూట‌మిలో భాగంగా టి.డి.పితో వియ్యం ఆ రాష్ట్రంలో క‌య్యాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధ‌మ‌య్యిన సి.పి.ఐ, తెలంగాణలో కూట‌మి ఏర్పాటు అయ్యాక రాజ‌కీయ ప‌రిమాణాలన్నీ తారుమారు అయ్యాయి.
2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డంతో దూర‌మైన పార్టీలు, 2018 ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేనాటికి సీన్ రివ‌ర్స్ అయిపోయింది. తెలుగుదేశంతో సి.పి.ఐ పొత్తు తెలంగాణ‌లో స‌వ్యంగా జ‌రుగుతుంది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సిపీఐ ఎటూవైపూ చూస్తుందనే దానిపైనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిన్న, మొన్న‌టి వ‌ర‌కు జ‌న‌సేనవైపూ చూసిన సి.పి.ఐ, తాజాగా యూట‌ర్న్ తీసుకుంద‌నే చేప్పాలి. ఎందుకంటే జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ బీజేపీతో లోప‌యకారి ఒప్పందం చేసుకున్న‌ట్లు వ‌స్తున్న స‌మాచారమే అందుకు కార‌ణ‌మై ఉంటుంద‌ని కొంత‌మంది రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల‌లో ఏ పార్టీవైపు ఉంటుందనేది ప్ర‌స్తుత ఎన్నిక‌ల త‌ర్వాత వ‌చ్చే ఫ‌లితాల‌ననుస‌రించి మిగిలిన నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చు. కాగా, ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా అన్ని రాజ‌కీయ పార్టీల‌ను క‌లుపుకునిపోయే విష‌యంలో చంద్ర‌బాబు ఒక‌డుగు ముందే ఉండ‌డంతో దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే కాంగ్రెస్ జాతీయ నాయ‌కులు అమ‌రావ‌తిలో చ‌ర్చ‌ల‌కు రావ‌డంతో అక్క‌డ కూడా కూట‌మిగానే ముందుకెళ్ళే అవ‌కాశాలు ఉండ‌నున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *